షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన లవ్ టుడే హీరోయిన్..

షూటింగ్ లో ప్రమాదాలు జరగడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. హీరోలు చాలా మంది షూటింగ్స్ లో గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు.

తాజాగా ఓ హీరోయిన్ కూడా షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దివ్య ఖోస్లా‍ ఈ అమ్మడు ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టుడే తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే దివ్య ఖోస్లా‍ హీరోయిన్ గా పరిచయం చేస్తూ.. లవ్ టుడే అనే తెరకెక్కించారు. ఈ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది.

ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఎక్కువ లు చేసింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ షూటింగ్ లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడింది.

దాంతో దివ్య ఖోస్లా‍ మొఖానికి తీవ్ర గాయం అయ్యింది. గాయం కారణంగా ఆమె మొఖం ఎర్రగా మారిపోయింది . దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents