Print Friendly, PDF & Email

తినండి.. తాగండి.. సెX చేయండి.. విద్యార్థులకు ఆర్జీవీ పాఠాలు

0 27,807

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న.. ఆయనకు ఏది అనిపిస్తే అది చెప్తాడు.

ఏది అనిపిస్తే అది చేస్తాడు. ట్విట్టర్ లోనే కాదు మైక్ ముందు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంలో వర్మ దిట్ట. నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. కాలేజీ విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి అనే సిద్ధాంతం తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకురావడమే కాకుండా తినండి.. తాగండి.. సెX చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది. వర్మను గెస్ట్ గా పిలిచిన ఆ కాలేజ్ ఏంటిది అనేది తెలుసుకుందాం.

Ram Gopal Varma: తినండి.. తాగండి.. సెX  చేయండి.. విద్యార్థులకు ఆర్జీవీ పాఠాలు

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నేడు అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 అనే ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యాడు. ఇక వర్మను చూడగానే స్టూడెంట్స్ రెచ్చిపోయారు. స్టార్ హీరోలు ప్రీ రిలీజ్ కు వస్తే ఎలా అరుస్తారో ఆ రేంజ్ లో స్టేడియం మొత్తం ఆర్జీవీ పేరుతో మారుమ్రోగిపోయింది. ఇక ట్విట్టర్ లో ఒకలాగా.. స్టూడెంట్స్ తో మరోలా మాట్లాడితే ఆర్జీవీ ఎలా అవుతాడు. అందుకే ఇక్కడ కూడా తన సెX పురాణం మొదలుపెట్టాడు. “సాధారణంగా ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చాం అని చెప్తారు. దాన్ని నేను నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. మనం చేసే పనిని పక్కవాడితో చేయించేలా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి. నేను కాలేజ్ కు వచ్చాను కదా అని నేనో పెద్ద గొప్ప స్టూడెంట్ ను అని అనుకోవద్దు. నేను కాలేజ్ కు వచ్చి బ్యాక్ బెంచ్ లో కూర్చొని నోవెల్స్చదివేవాడిని. కనకదుర్గమ్మ టెంపుల్ కు వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని.

ఇక నేను నా గురించి చెప్పుకోవాలంటే.. పిచ్చి నా కొడుకును, జంతవును. యానిమల్స్ కు రిలేషన్స్ ఉండవు.. తిండి, ఆకలి, నిద్ర, సెX .. వాటికవే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాయి. మనం కూడా జంతువులాంటివారమే. ఇక చావు.. ఎప్పడు వస్తుందో ఎవరు చెప్పలేరు. నేను కనుక చనిపోతే మా అమ్మకు ఒకటే చెప్పాను.. నా శవం ముందు డ్యాన్స్ వేసి.. న నాకొడుకు రంభ, ఊర్వశి, మేనకల దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్పు అని చెప్పా. అందరికి తెలిసి చనిపోయాక రెండు దారులు ఉంటాయట. ఒకరి స్వర్గానికి వెళ్లి రంభ, ఊర్వశి, మేనకలతో డ్యాన్స్ చేయడం, రెండు నరకానికి వెళ్లి యముడు వేసిన శిక్షలకు లోగిపోవడం. చెప్పాలంటే.. చనిపోయిన తర్వాత రంభ, ఊర్వశి, మేనకలు, ఉంటారని అపోహ పడుతున్నారేమో! ఒకవేళ వారు లేకపోతే ఎలా.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయండి.. తినండి.. తాగండి.. సెX చేయండి. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ రేంజ్ లో వర్మ స్పీచ్ విని అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. స్టూడెంట్స్ కు చెప్పే విధానం ఇదేనా అని మండిపడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అసలు స్టూడెంట్స్ కు హితబోధ చేయమని వర్మను పిలిచింది ఎవరు..? ఆయనను పిలిస్తే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents