Print Friendly, PDF & Email

లిక్కర్‌ కేసులో ట్విస్ట్‌: ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్‌

0 7,193

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్‌ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది.

Promises made during Andhra bifurcation still pending: Kalvakuntla Kavitha  | India News,The Indian Express

అయితే, కవిత తన పిటిషన్‌లో కీలక వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ నన్ను వేధిస్తోంది. నా విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు ఎక్కడా లేదు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్లకు విశ్వసనీయత లేదు.

ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తుంది. చందన్‌ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనం. అరుణ్‌ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈడీ అధికారులు నా సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా నా ఫోన్‌ సీజ్‌ చేశారు. నా ఫోన్‌ సీజ్‌ చేసిన సమయంలో నా వివరణ తీసుకోలేదు. నా నివాసంలో లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరపాలి అని పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్‌ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents