Print Friendly, PDF & Email

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపు

0 6,916

ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. సుమారు 1, 150 ఓట్ల తేడాతో సమీప పి.ఆర్.టి.యు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.

వివరాళ్లోకి వెళితే.. ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తైంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఈ కౌంటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన ఆధిక్యం దక్కకపోవడంతో.. ఎలిమినేషన్ పద్ధతిలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.

మూడవ స్థానంలో ఉన్న పాపన్నగారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.

శుక్రవారం తెల్లవారుజూము వరకు జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ బలపర్చిన తన సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.

ఇక, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాలుగవ రౌండ్లోనే నిష్క్రమించారు. కాగా, మొత్తం 29,720 ఓట్లకు గాను 25, 868 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 452 ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents