కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
“కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలి. రేపు ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నా.” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు.
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సరంపేట చౌరస్తా నుంచి కామారెడ్డి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కామారెడ్డి బిడ్డ. వందలాది మంది ప్రాణత్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే… ఒరిగిందేమిటి? బొంబాయి, దుబాయి.. బొగ్గుబాయి అంటూ.. మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు గల్ఫ్ బాధితులకు కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణలో గుంటనక్కలు కాంగ్రెస్ పార్టీని పీక్కు తిన్నా సోనియా తెలంగాణ ఇచ్చారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. మేకతోలు కప్పుకున్న తోడేలు లంతోడు గంప గోవర్ధన్. కామారెడ్డి ప్రజలను నట్టేట ముంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఔటర్ రింగు రోడ్డు పేరుతో ప్రజల్ని నట్టేట ముంచ్చలనుకుండు..
మీ పోరాటంతో వెనక్కు తగ్గిండు. మళ్లీ బీఆరెస్ గెలిస్తే మీ భూములను గుంజుకుని మిమ్మల్ని ఆగం చేస్తారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంది.
తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. మా పోరాట ఫలితంగా 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు.
ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలి. రేపు గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం.
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు దీక్షకు తరలిరండి. 2004లో గెలిపించినట్టే.. 2024లో 50వేలకు పైగా మెజారిటీతో షబ్బీర్ అలీని గెలిపించండి. ఆయన ఒక్క సంతకంతో ఎన్ని నిధులంటే అన్ని నిధులు ఇచ్చే కుర్చీలో కూర్చునేలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. కాళేశ్వరం 20,21,22 ప్యాకేజి పనులు పూర్తి చేసి ఉమ్మడి నిజామాబాద్ లో 3లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం..
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సరంపల్లి చౌరస్తా నుంచి రాజంపేట వరకు యాత్ర నిర్వహించారు. తర్వాత అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. నోటికొచ్చిన అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెలపై తంతున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడితే 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.