చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని ఎన్ని రోజులు కష్టపడి చదివిన జాబ్ కొట్టకుండా అసంతృప్తికర జీవితం గడపలేనని ఈరోజు ఒక నిరుద్యోగ యువకుడు పద్మశాలి ముద్దుబిడ్డ చిటికెన నవీన్ కుమార్ సిరిసిల్ల పట్టణం ,బివై నగర్ కు చెందిన యువకుడు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. నిరుద్యోగి అయిన నవీన్ కు ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పద్మశాలి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గీత భవన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో నిరసన తెలిపి ,వారి ఆత్మకు శాంతి చేకూరాలని పద్మశాలి అనుబంధ సంఘాలు అందరo కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు.
జోహార్ నవీన్ జోహార్ జోహార్ ….
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి నాయకులు అడిచర్ల రాజు ,జిల్లా పద్మశాలి యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు , సక్సెస్ సతీష్ ,మల్లికార్జున్
కొండ రాజు ,లక్ష్మీనారాయణ , కటకం కృష్ణ , అనుమండ్ల ఉమా శంకర్ మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం కుల బాంధవులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని నవీన్ కి నివాళులర్పించడం జరిగింది అన్నారు.