పబ్లిక్ సర్విస్ కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ, అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు – మంత్రి గంగుల కమలాకర్
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో తెలంగాణ యువతకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే మంత్రి కేటీఆర్ గారు నిన్న భరోసా నిచ్చారన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు తెలంగాణ భవన్లో మిడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ద సంస్థల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండదని ఈవిషయం తెలసీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించేవిదంగా ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసి, బురద జల్లేవిదంగా ప్రతిపక్షాలు టీఎస్పీఎస్సీ అంశంలో ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు లీకేజీ జరిగిందనే సమాచారం ప్రతిపక్షాలకు, పత్రికల కన్నా ముందే ప్రభుత్వానికి అందగానే మార్చి 12నే సిట్ వేసి విచారణ ప్రారంభించామని, అదేరోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసామన్నారు. ఈసోయి లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పోటీ పాదయాత్రలు నడుస్తున్నాయని, ఇందులో బట్టి పాదయాత్ర కనుమరుగు కావడానికి కేటీఆర్ గారిపై ఆయన పేషీపై ఇష్టానుసారం ఆదారం లేని ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు. బీసీ బిడ్డైన కేటీఆర్ పీఏ తిరుపతి పై రేవంత్ చేసే ఆరోపణలు మానుకోవాలని, ఈ అసంబద్ద ఆరోపణల్ని ఎవరూ నమ్మోద్దని చెప్పారు, అసలు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి మాకు ఏం సంబందమని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్,
స్కాం అని కుంభకోణం అని ప్రతిపక్షాలు ప్రజలను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కానీ ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన దుశ్చర్య అన్నారు మంత్రి గంగుల. నాడు రోశయ్య హయాంలో ఎపీపీఎస్సీ స్కాంలో నాటి సభ్యుడు రిపుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేసినపుడు నాటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసారా… ముఖ్యమంత్రి రాజీనామా చేసారా అని ప్రశ్నించారు, అలాగే 2010లో యూపీఎస్సీ అవకతవకలకు సంబందించి జాయ్స్ జాయ్ని అరెస్ట్ చేస్తే ప్రధాని రాజీనామా చేసారా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో పేపర్ లీకేజీ, పూటకో ఉద్యోగ కుంభకోణాలు జరుగుతున్న విషయం ప్రజలకు తెలుసన్నారు మంత్రి గంగుల.
ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీలు భానూప్రసాద్, ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.