బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలోని పై అంతస్తులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది, స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.