ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి
గన్నేరువరం మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన అటికం శంకరయ్య (65) కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శంకరయ్య కుమారుడు రవి మద్యం సేవించి ఆస్తి విషయంలో గొడవపడి తండ్రి శంకరయ్య తలపై కొడుకు రవి బ్యాట్ తో దాడి చేశాడు. శంకరయ్య ముఖంపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు.
వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి శంకరయ్యను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వుందని స్థానికులు తెలిపారు.