కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య
కరీంనగర్ పట్టణంలో బుధవారం దుర్గం నరేందర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో స్థానిక ఏసీబీ శ్రీనివాస్ నేతృత్వంలో సంఘటన స్థలాన్ని పరిశీలించి చనిపోయిన వ్యక్తి విద్యానగర్ కి చెందిన దుర్గం నరేందర్ గా పోలీసులు గుర్తించారు. నరేందర్ పక్కనే మద్యం సీసాలు పోలీసులు గుర్తించారు. తాగిన మైకంలో హత్య చేశారా! కుటుంబ కలహాలతో హత్య చేశారా! ఇతర కారణాలతో హత్య చేశారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.