ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు
జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్ఐ కిరణ్ ఈ నెల 17న వాహనాల తనికీ చేస్తుండగా టి ఎస్ 02 ఈ ఎం 4230 నంబర్ గల ద్విచక్ర వాహనం 50 కి పైగా ట్రాఫిక్ చలాన్ లు పెండింగ్ లో ఉండి రూ. 10, 715 పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి వాహన యజమాని కి కౌన్సిలింగ్ నిర్వహించి బుధవారం పెండింగ్ చాలాన్లు మొత్తం రూ 10, 715 కట్టించారు. మొత్తం డబ్బులు కట్టిన వాహన యజమానిని ఎస్ఐ అభినందించారు.