అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని కెసిఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఏకరాకు రూ 80,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో, అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం ఏనాడు ఆదుకున్నది లేదని, పంట నష్టపోయి రైతు కన్నీరు పెడితే ఓదార్చిన పాపాన పోలేదని, పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి తొమ్మిదేళ్లుగా ఆలోచన చేయడం లేదని, కనీసం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా రైతులను అరగోస పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే సోయి లేకుండా పోవడం దారుణమన్నరు. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతాంగం పంట నష్టపోతుంటే తొమ్మిదేళ్లుగా కెసిఆర్ ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇతర కారణాలవల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికిబిజెపి మోడీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం తీసుకొచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలో ఈ పథకం అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం మోకాలడ్డుతుందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కోత దశలో రాళ్ల వాన పడటంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ,మిర్చి, మామిడి, ఖరబూజ, మొక్క జొన్న వంటి పంటల కు తీవ్ర నష్టం ఏర్పడడంతో అన్నదాత తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.80,000 రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని, రైతులకు బ్యాంక్ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా వడ గళ్ళ వాన తీవ్రత పై , పంట నష్ట వివరాలపై జిల్లా యంత్రాంగం రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ ల తో కలసి వేగంగా సర్వే చేపట్టి ప్రభుత్వానికి నష్టపోయిన రైతుల వివరాలు పంపించి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి.శంకర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కొరటాల శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మంజులవాణి జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, అలివేలు సమ్మిరెడ్డి,సంకిడి శ్రీనివాసరెడ్డి, ఎడమ సత్యనారాయణ రెడ్డి,ఊగిలే సుధాకర్ పటేల్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జాడి బాల్రెడ్డి, అన్నాడి రాజిరెడ్డి, బండ రమణారెడ్డి, పుప్పాల రఘు, ముత్యాల జగన్ రెడ్డి, మాడ గౌతంరెడ్డి, గుర్రాల లక్ష్మారెడ్డి, నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, మాడిశెట్టి సంతోష్, రామిడి ఆదిరెడ్డి, లక్ష్మీనారాయణ, రమణారెడ్డి, రవీందర్ రెడ్డి,మడ్గూరి సమ్మిరెడ్డి, సొల్లు అజయ్ వర్మ, చిట్టారెడ్డి లక్ష్మణరావు, తూర్పాటి రాజు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.