సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండల కేంద్రంలో గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10వేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టంపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన సీఎం కేసీఆర్ రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం అందిస్తామని ప్రకటించడమే కాకుండా 228 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.
నియోజకవర్గంలోని రైతాంగానికి సైతం పంట నష్టపరిహారం అందిస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, కేడీసీసీబి డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బోయిని రాజమల్లయ్య, వైస్ ఎంపీపీ కోట స్వప్న రాంరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు గుడుగుల సతీష్, చంద్రమొగిలి, రాజమౌళి, లావణ్య, తాజుద్దీన్, సారయ్య, రవిందర్ రెడ్డి, రైతుబంధు సమితి బాధ్యులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.