మా దారి మేం చూసుకుంటాం బిజెపి పెద్దలను కలిసిన ఈటెల రాజేందర్
రాష్ట్ర బీజేపీ లో ఏం జరుగుతున్నది? ఈ ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున నేతలంతా కొత్త, పాత తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచిస్తే.. దాన్ని నేతలు ఆచరిస్తున్నారా? నేతల మధ్య విభేదాలు సమసిపోయి సఖ్యత నెలకొన్నదా? అంటే అదేమీ లేదు అనే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్న సంజయ్ వైఖరితో విసిగిపోతున్న కొంతమంది నేతలను ఆయనను తప్పించాలని కోరుతున్నారు.
దీంతో సంజయ్‌ను పక్కనపెట్టి ఈటల రాజేందర్ లాంటి నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను వీడి బీజేపీలో చేరిన నేతలు ఇదే అంశంపై స్పష్టత కోసం ఈ మధ్య హస్తినబాట పట్టారట. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగిసినా మరో ఏడాది పొడిగించారు. అలాగే ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఒక్క తరుణ్‌చుగ్ మినహా ఎవరూ ఇప్పటివరకు ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించలేదు.