మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది.
బెల్లంపల్లి కోర్టు దగ్గర ద్విచక్ర వాహననికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.