కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మేయర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ 14వ డివిజన్ సప్తగిరికాలనీ లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని నగర మేయర్ వై. సునీల్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.