పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం ఆరెంద గ్రామానికి చెందిన సింగరేణి రైటైర్డు ఆఫీసర్ కొమ్మిడి భూంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పలువురుని ఆకట్టుకుంది. స్థానిక లక్ష్మిభారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చిన్ననాటి మిత్రులు, ఆత్మీయ బంధువుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

మంథని ప్రాంతానికి చెందిన భూంరెడ్డి సింగరేణిలో అనేక ఉన్నత పదువులు చేసి పదవీ విరమణ అనంతరం మంథని ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన భూంరెడ్డిని పలువురు అభినందించారు.

చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనమునకు బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఏసీస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి హాజరై, కొమ్మిడి స్వర్ణలత-భూమారెడ్డి (రిటైర్డ్ సింగరేణి ఆఫీసర్) దంపతులను శాలువాతో సన్మానించారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్క వ్యక్తి తమ ఉనికిని కాపాడుకుంటూ, పేద ప్రజలకు సహాయం చేస్తూ, పలువురికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, భూమారెడ్డి భవిష్యత్ లో గొప్ప స్థానంలో ఉండాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, ఎంపిపి కొండ శంకర్, మాజీ సర్పంచ్ లు మాదాడి ప్రభాకర్ రెడ్డి, ఆరెంద లింగారెడ్డి, పర్స బక్కయ్య, నూకల బానయ్య, కాటారం సింగిల్విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, నాగినేని జగన్మోహన్ రావు, బెల్లంకొండ నర్సింగరావు, టిజిబికెఎస్ నాయకుడు రాజిరెడ్డితో పాటు పలువురు సింగరేణి అధికారులు పాల్గొన్నారు.