బీభత్సం సృష్టించిన కారు
మండేపల్లి గ్రామానికి చెందిన పెద్ది పరుశురాములు తంగళ్ల పల్లి నుండి తన గ్రామానికి ద్వి చక్ర వాహనం మీద వస్తుండగా మండేపల్లి నుండి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది.అంతటితో ఆగకుండా ఎగుర్ల సత్తవ్వను ఢీ కొని పక్కనే ఉన్న ఆటో ని కూడా ఢీ కొని ఆగిపోయింది.కార్ లో ఉన్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవడంతో కార్ లో ఉన్న వారికి ప్రమాదం తప్పింది.పెద్ది పరుశురాములుకు కాలు విరగగా,కార్ లో ఉన్న సాయి తేజ,సాయి కుమార్,రమణ ప్రశాంత్,సత్తవ్వలకు తీవ్ర గాయాలు అయ్యాయి.సత్తవ్వ పరిస్థితి విషమంగ ఉండటంతో కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.