ధర్మారం వారసంత వేలం పాట : గ్రామ పంచాయతీ కార్యాలయం
ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతకు ఒక సంవత్సరం హక్కుదారు వేలం పాట కార్యక్రమం సోమవారం రోజున ఉదయం పది గంటలకు నిర్వహించబడుతుందని ధర్మారం గ్రామ పంచాయతీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ బాబు, సర్పంచ్ పూస్కూరు జితేందర్ రావు సమక్షంలో వార సంత వేలం పాట నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు యాబై వేల రూపాయలు ధరావతు (డిపాజిట్) చేయవలసి ఉంటుంది అని గ్రామ పంచాయతీ పేర్కొంది.