Print Friendly, PDF & Email

బిజెపిలో చేరిన మాజీ సిఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

0 4,204

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని.. దీంతో ఎపిలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.
బిజెపిలో చేరిన మాజీ సిఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు నిర్వహించారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున కిరణ్‌ కుమార్‌ రెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents