Print Friendly, PDF & Email

ప్రధాని మోడీ టూర్‌కు మందు ఫ్లెక్సీల కలకలం!

0 15,557

 తెలంగాణలో మోడీ టూర్ సెగలు పుట్టిస్తోంది. రేపటి ప్రధాని పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘పరివార్ వెల్కమ్స్ యూ మోడీజీ’ అనే పేరుతో బీజేపీకి చెందిన వారసుల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మోడీ పర్యటనకు ముందు ఫ్లెక్సీల ఏర్పాటు సంచలనం అవుతోంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మోడీ రేపటి పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ కుటుంబ పరిపాలనను టార్గెట్ చేస్తారని గ్రహించే బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ మోడీ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన విషయం దుమారం రేపిన సంగతి తెలిసిందే.

HYD: ప్రధాని మోడీ టూర్‌కు మందు ఫ్లెక్సీల కలకలం!

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents