పుష్ప-2 లో అల్లు అర్జున్ లుక్‌పై చిరు కామెంట్.. ట్వీట్ వైరల్
మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐకాన్ స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ స్టార్‌గా ఎదిగాడు.నేడు(శనివారం) అల్లు అర్జున్ 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి బన్నీకి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డియర్ బన్నీ.. పుష్ప-2 ది రూల్ ఫస్ట్ లుక్ రాకింగ్‌గా ఉంది. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
కాగా చిరంజీవి సినిమాతోనే అల్లు అర్జున్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించిన బన్నీ ఆ తర్వాత ‘స్వాతిముత్యం’, ‘డాడీ’ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. నేడు పుష్ప చిత్రంతో పాన్‌ఇండియా స్థార్‌గా సత్తా చాటుతున్నారు.
Happy Birthday Dear Bunny @alluarjun !
Many Happy Returns!! 💐💐Also The First Look of #Pushpa2TheRule Rocks!
All The Very Best!!— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2023