ఐశ్వర్య రాయ్ తో విడాకుల పై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేవి ఎక్కువైపోయాయి. చాలామంది ఎన్నో రోజులు కాపురాలు చేశాక కూడా చిన్నచిన్న విభేదాలతో విడాకుల బాట పడుతున్నారు. అయితే కొంతమంది నిజంగానే విడాకులు తీసుకుంటే మరి కొంతమంది సెలబ్రిటీలపై చాలామంది నెటిజన్స్ లేనిపోని విడాకుల వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
దానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా తన కూతురుతో కలిసి ఒంటరిగా హాజరవ్వడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అభిషేక్ బచ్చన్ వారితో రావడానికి ఇష్టపడడం లేదని, వీరిద్దరూ త్వరలోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకుబోతున్నారు అంటూ ఇలా రకరకాల రూమర్లు తెరపై వినిపించాయి. ఇక ఈ మధ్య కాలంలో నీతూ అంబానీ ఏర్పాటు చేసిన కల్చర్ ఈవెంట్ లో కూడా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్య తో కలిసి పాల్గొంది.
ఇక ఈ ఈవెంట్ లో కూడా అభిషేక్ బచ్చన్ పాల్గొనలేదు.దాంతో మరోసారి వీరి విడాకుల వార్తలు తెరపై వైరల్ అయ్యాయి.అయితే తాజాగా ఈవిడాకులు వార్తలకు క్లారిటీ ఇచ్చారు అభిషేక్ బచ్చన్. ఐశ్వర్యారాయ్ ఆరాధ్య ఇద్దరు కలిసి ఫంక్షన్ లో దిగిన ఫోటో ని ఐశ్వర్య రాయ్ తన సోషల్ మీడియా ఖాతా లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోను చూసిన ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్ అంటూ ఒక కామెంట్ పెట్టాడు.
ఇక ఈ కామెంట్ చూసిన అభిషేక్ బచ్చన్ నాకు కూడా ఫేవరేటే అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ పెట్టిన కామెంట్ వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య విడాకుల వార్తలు వట్టి పుకార్లే అంటూ క్లారిటీ వచ్చింది. విడాకుల వార్తలపై పరోక్షంగా అభిషేకం బచ్చన్ స్పందించినట్లు అయింది.