ప్రధాని మోడీ బహిరంగ సభకు తరలిన కరీంనగర్ బిజెపి శ్రేణులు..
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కరీంనగర్ బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శనివారం ఉదయం తిమ్మాపూర్ మండలం రేణికుంట ప్రాంతంలో వాహనశ్రేణిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే 11 వేల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయడం హర్షణీయం అన్నారు.బిజెపి మోది ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కి కట్టుబడి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు . రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ , అభివృద్ధిపై లేదని , అందుకే ప్రధాని మోడీ తెలంగాణలో చేసే అభివృద్ధి పనుల కార్యక్రమాలకు దూరంగా ఉంటుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, పెరుక శ్రవణ్ ,ముత్యాల జగన్ రెడ్డి బండ రమణారెడ్డి, కార్పొరేటర్లు కచ్చు రవి,కొలగాని శ్రీనివాస్, కాసర్ల ఆనంద్, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు సుగుర్తి జగన్, దొడ్డేల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.