తిరుపతి ప్రయాణం వాయిదా వేసుకుంటేనే మంచిది TTD వెల్లడి
కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే మీకు ఓ అలర్ట్.. ప్రస్తుతం ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిందని టీటీడీ కోరుతోంది.. అలాగే వేసవి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతుంది. దీనికి కారణం ఏంటంటే.. ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులతో పాటు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడమే కారణమని అంచనా వేస్తున్నారు.

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని.. అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు కోరుతున్నారు.

ఓ వైపు భారీగా ఎండలు పెరుగుతున్నాయి.. ఇదే సమయంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో భక్తులంతా తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.