ట్రస్మా ఆద్వర్యంలో ఇంటర్ స్టేట్ 2022-23 అవార్డుల ప్రధానోత్సవం
ప్రైవేట్ విద్యాసంస్థలకు తమ సంపూర్ణ మద్దతు అందిస్తామని… రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ట్రస్మా ఆధ్వర్యంలో చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎలాంటి లాభపేక్ష లేకుండా ఉపాద్యాయులు… విద్యార్థి వృద్దిలోకి రావాలనే ఉద్దేశంతో విద్యాబోదన చేస్తుంటారని కొనియాడారు.
ట్రస్మా ఆద్వర్యంలో సాట్ ఇంటర్ స్టేట్ 2022-23 విద్యార్థులకు అవార్డులను మంత్రి చేతులమీదుగా అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి… జ్యోతి ప్రజ్వలనతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి పలువురు అతిథులు ప్రసంగించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాతూ విద్యాలయాలను దేవాలయాలుగా భావించేది ఉపాద్యాయులేనని… మంత్రి అన్నారు. విద్యను పంచడమే వారి కర్తవ్యంగా భావిస్తుంటారని చెప్పారు. విద్యను భావితరాలకు అందిస్తూ… లాభాపేక్ష లేకుండా విద్యాలయాలను నడుపుతున్నారని తెలిపారు. కరోనా కరువు సమయంలో ఉపాద్యాయులను ఆదుకున్నామని గుర్తుచేశారు. చాలీ చాలని జీతాలతో ఉపాద్యాయులు బ్రతుకులీడుస్తున్నారని చెప్పారు. ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేలలా ముందుంటుందని చెప్పారు. తెలంగాణ సాధనలో విద్యారంగానిది కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సంజీవరెడ్డి, ప్రసాద్ రావు, శ్రీపాల్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్స్, ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.