అన్ని వర్గాల ప్రజలకు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలి : గంగుల
అన్ని వర్గాల ప్రజలకు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని బీసీ సంక్షేమ పూర్వసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.. నేడు ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంలో… హుస్సేన్ పుర లో షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో పేద ముస్లీంల కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమంగా చూస్తోందని… అన్నారు..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని గౌరవిస్తూ…హిందూ ముస్లిం క్రైస్తవులకు తమ పండుగలను సంతోషంతో జరుపుకోవాలని సంకల్పంతో వారి పండుగలకు కొత్త బట్టలను అందజేస్తుందని అన్నారు… ముస్లిం మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు వాటి అమలులోనూ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు..ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల అమలుతో వారి జీవితాల్లో కొత్త జోష్ వచ్చిందని అన్నారు..
ప్రతీఏటా సంక్షేమానికి పెద్దఎత్తున నిధుల కేటాయింపుతో పాటు ముస్లింల అభివృద్ధిపై ప్రత్యేకంగా సీఎం దృష్టి సారించారు ..సమైక్య పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని అన్నారు… ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అంజద్ అలీ, మైనార్టీ నగర అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, వాజీద్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు