రింకూ సింగ్ సిక్సర్ల మోత.. కోల్‌కత్తా థ్రిల్లింగ్ విక్టరీ..

IPL 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సంచలన విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ రింకూ సింగ్(21 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 48 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ సింగ్.. వరుసగా ఐదు సిక్స్‌లు బాది చారిత్రాత్మక విజయాన్నందించాడు. అయితే ఇదే మ్యాచ్‌లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ సీజన్ తొలి హ్యాట్రిక్‌ను రషీద్ ఖాన్ నమోదు చేశాడు. డేంజరస్ బ్యాటర్లు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వికెట్లను పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63), సాయి సుదర్శన్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents