రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్
రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్( ఈనెల 10న సోమవారం) సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రారంభానికి సిద్ధమైన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆదివారం అధికారులు తెలిపారు.
పర్యటన వివరాలు: –
1) ఉదయం 10. 30 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ,
ఎస్సి, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ కు శంకుస్థాపన
సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, ఉదయం 11: 15 గంటలకులక్ష్మిపూర్ లో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం, ఉదయం 11: 30 గంటలకు పాపాయపల్లె గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు గోపాల్ రావు పల్లెలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, మధ్యాహ్నం 12. 30 తంగళ్లపల్లి మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పీజీయోథెరపీ సేవల ప్రారంభం, మధ్యాహ్నం 1 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, మధ్యాహ్నం 1. 30 గంటలకు గండిలచ్చ పేటలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, దళిత బంద్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభోత్సవం. దళితబంధు లబ్ధిదారులతో కలిసి లంచ్, మధ్యాహ్నం 2. 30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గౌడ, మహిళ సంఘాలు, చిట్టివాగు పై బ్రిడ్జి ప్రారంభోత్సవం. యాదవసంఘం మల్లన్న పట్నాలకు హాజరు, మధ్యాహ్నం 3. 30 గంటలకు బుగ్గారాజేశ్వర తండా(అక్కపల్లి)గ్రామపంచాయతీ భవనం, ఎస్టీ కమ్యూనిటీ హల్ ప్రారంభోత్సవం, సాయంత్రం 4 గంటలకు రాచర్లగుండారంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సాయంత్రం 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుంది.