Print Friendly, PDF & Email

తెలంగాణలో అమిత్ షా టూర్‌.. ఆర్ఆర్‌ఆర్ టీమ్‌కు విందు.. షెడ్యూల్ ఫిక్స్

0 11,889

 నెల 23న తెలంగాణకు రాబోతున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణ వస్తున్న అమిత్ షా(Amit Shah)..

అదే రోజు ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్(RRR) టీమ్‌కు విందు ఇవ్వనున్నారు. వారిని సన్మానించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్,(Ram charan) రాజమౌళి(Rajamouli), కీరవాణి, చంద్రబోస్‌తో పాటు విజయేంద్రప్రసాద్‌కు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం గంటపాటు తెలంగాణ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. అదే రోజు సాయంత్రం చేవేళ్లలో బహిరంగ సభ ఉంటుంది. ఇక గతేడాది ఆగస్టు 22న అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. నడ్డాతో నితిన్, మిథాలీ రాజ్ భేటీ అయ్యారు.

Amit Shah: తెలంగాణలో అమిత్ షా టూర్‌.. ఆర్ఆర్‌ఆర్ టీమ్‌కు విందు.. షెడ్యూల్ ఫిక్స్

కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఆదివారం అమిత్ షా వెళ్తున్నారు. మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి.. దగ్గర్లోని చేవెళ్ల లేదా వికారాబాద్‌లో రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొననున్నారు. మోడీ టూర్ ముగిసిన 15 రోజుల వ్యవధిలోనే అమిత్ షా రానుండటంతో రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ ఏర్పాట్ల సక్సెస్‌పై చర్చించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, తాండూర్, వికారాబాద్ , పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై చర్చించారు.

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేతో సదరు మాజీ మంత్రికి అస్సలు పొసగడం లేదు. తాను మొదటి నుంచీ ఉన్న పార్టీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యే నుంచి అడగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఆయన పలు మార్లు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండాపోవడంతో సదరు మాజీ మంత్రి ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన అమిత్ షా టూర్‌ సందర్భంగా బీజేపీలో చేరికపై ప్రకటన రాకున్నా.. మంచి ముహుర్తం చూసుకొని చేరిపోవచ్చనే ప్రచారం సాగుతోంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents