త్వరలో తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు..!
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని తన చిట్టి నడుముతో ఊపేసిన ఇలియానా (Ileana) తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తోంది.
అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. నిజానికి ఈ అమ్మడుకు పెళ్లి కాలేదు. దాంతో పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం ఏంటి, ఆల్రెడీ పెళ్లై పోయిందా ఏంటి, అసలు మీ బిడ్డ తండ్రి ఎవరూ అంటూ నెటిజన్లు ఆమెను అనుచిత ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ విషయంపై ఇలియానా స్పందించలేదు.
ఇలియానా తన పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచుకుంటుంది. కానీ కొందరు ఆమె వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకర ప్రశ్నలు అడుగుతుంటారు. ఇప్పుడు కూడా ఆమె తన బిడ్డకు తండ్రి ఎవరో సీక్రెట్‌గా ఉంచింది. అదంతా తనకు వ్యక్తిగతమైనా కొందరు మర్యాదలేకుండా తండ్రి ఎవరో చెప్పాలంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే వీటిపై ఇలియానా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. గతంలో ఈ తార ఎవరేమనుకున్నా తనకు అనవసరమని స్టేట్మెంట్ ఇచ్చింది. పిచ్చి ప్రశ్నలు వేస్తే, ఈమె అదే స్థాయిలో రిప్లై ఇచ్చి ట్రోలర్స్ నోరు మూయిస్తోంది.
* గతంలో జరిగిన ఇన్సిడెంట్
2019లో ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్‌ను నిర్వహించింది. ఆ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ వచ్చింది. అయితే ఒక నెటిజన్ ఆమెను ఎవరినీ అడగకూడని ఒక ప్రశ్న అడిగాడు. “నీ వర్జినిటీ/ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయావ్?” అని సదరు నెటిజన్ ప్రశ్నించాడు. అందుకు..’నా పర్సనల్ లైఫ్ గురించి అంత ఆసక్తి ఎందుకు.. ఇదే ప్రశ్న మీ అమ్మను అడిగితే ఏం సమాధానం చెబుతుందో?’ అని సమాధానమిస్తూ ట్రోలర్‌కి ఆమె బుద్ధి చెప్పింది. ఈ చెత్త ప్రశ్నను, దానికి తానిచ్చిన స్ట్రాంగ్ రిప్లైను ఆమె 2019లో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసుకుంది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఈ రిప్లై వైరల్ కూడా అయింది.
* వారితో డేటింగ్
ఇలియానా తొలిసారిగా ఒక ఫారినర్‌తో ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఈ హాట్ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. వీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇంతలోనే వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ బ్రేకప్ ఆమెను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇలియానా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టేసింది. ఈ మధ్యకాలంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంపై ఇలియానా ఇప్పటివరకైతే నోరు మెదపలేదు. కాగా ఒక కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్‌లో కరణ్ జోహార్ వారి సంబంధాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది.