గుమగుమలాడే చికెన్ కోసం గరిట తిప్పిన రోజా.. దత్తత గ్రామంలో అందరికీ విందు ఇచ్చిన మంత్రి

 పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ముద్రతో రాజకీయాల్లో కొనసాగిన ఆర్ కే రోజా. మంత్రి అయ్యాక తనలో ఆల్ రౌండర్ క్వాలటీస్ ను బయటపెడుతున్నారు.

సాధారణంగా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు స్థానిక నేతలు, మంత్రులు అందులో పాల్గొనడం స్థానికులతో కలివిడిగా ఉండడం అన్నది సహజమే.. ఆ తరువాత అక్కడ పని చేస్తున్నట్టు ఫోటోలకు నాలుగు ఫోజులు ఇస్తారు కూడా.. కానీ మంత్రి రోజా మాత్రం అందుకు భిన్నం.. ఏదో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. స్వయంగా కథనరంగంలోకి దూకుతారు.. క్రీడలైతే ఆమె ప్లేయర్ గా మారుతారు.. తోటి వారితో కలిసి ఆడుతారు.. ఇక డ్యాన్స్ కార్యక్రమం అయితే ఆమె కూడా డ్యాన్స్ లు చేస్తారు.. ట్రాక్టర్, బస్సు లాంటి ప్రారంభోత్సవాలు అంటే ఆమె డ్రైవర్ గా మారుతారు.. ఇక విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు అయితే.. టీచర్ అవతారం ఎత్తుతారు.. ఒకటేంటి.. అది ఇది అని ఏదీ లేదు.. అన్నీ తానై స్థానికులతో మమేకమవుతారు.. తాజాగా గుమ గుమలాడే చికెన్ కోసం మంత్రి అయ్యి ఉండి కూడా గరిట తిప్పారు.. ఎందుకో తెలుసా..? పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మంత్రి ఆర్కే రోజా  ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు ఈ విందును ముస్లింలకు స్వయంగా రోజానే ఇచ్చారు. దత్తత గ్రామం మీరా సాహెబ్‌ పాలెంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోజా గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. స్వయంగా మంత్రి చికెన్ చేయడం చూసి.. స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.గతంలో ఎన్నికల సమయంలో మీరాసాహెబ్‌ పాళెంలో పర్యటించిన రోజా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. అనంతరం అధికారికంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మేరకు గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజా.. పలు అభివృద్ధి పనులు చేయించారు.

మీరాసాహెబ్‌ పాళెం, వేలావడి గ్రామాల్లోని 2,380 కుటుంబాలకు పార్టీ శ్రేణుల ద్వారా విందు, చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా స్వయంగా గరెట పట్టడం విశేషం. అక్కడికే ఆమె పరిమితం అవ్వలేదు. ఇఫ్తార్‌ విందు ప్రారంభానికంటే ముందుగానే గ్రామానికి చేరుకున్నారు.. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత పేద ముస్లింలకు కానుకలు అందజేశారు.

అలాగే ఏప్రిల్‌ 18వ తేదీన కూడా రోజా ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. తన నివాసంలో ముస్లింలకు రోజా విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న రోజా.. ‘ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా ముస్లిం సోదరురు భావిస్తారు, దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే..

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents