లక్షల కోట్ల సంపద బూడిద
ఎలెన్ మస్క్ ప్రయోగం విఫలమైంది. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం చేపట్టిన కొద్దిసేపటికే గాల్లోనే పేలిపోయింది. టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పెస్ ఎక్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.ఏప్రిల్ 20వ తేది గురువారం దక్షిణ టెక్సాస్‌లోని లాంచ్‌ప్యాడ్ నుంచి బయలుదేరిన స్టార్‌షిప్ రాకెట్ కొద్ది నిమిషాల తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పైన పేలింది. అంతరిక్ష నౌక కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది. అయితే ఈ ప్రయోగానికి ముందు స్పేస్ ఎక్స్ స్థాపకుడైన ఎలోన్ మస్క్ ప్రాజెక్టుపై అంచనాలను తగ్గించారు.
దెబ్బకొట్టిన ‘రాకెట్’ ప్రయోగం.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు
అతనో బిలియనీర్.. కోట్లకు కోట్ల సంపద. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 కంపెనీలకు బాస్. ప్రపంచ వ్యాప్తంగా 400 వ్యాపారాలతో నడిచే వర్జిన్ గ్రూప్ లిమిటెడ్ ను స్థాపించాడు. ఈ ఏడాది ప్రారంభంలో రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన శాటిలైట్ లాంచ్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయోగానికి పూనుకుంది. ‘స్టార్ట్ అప్ మీ’ పేరుతో తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ‘లూనార్ వన్స్’ అనే మాడిఫైడ్ 747 జెట్‌ను ఉపయోగించింది. అనుకున్నట్లుగానే లూనార్ వన్స్.. నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు దూసుకెళ్లింది. అయితే అనూహ్యంగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైనట్లు.. తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేవని కంపెనీ ప్రకటించింది.
ఈ ప్రయోగం విఫలం కావడంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మంచు కొండలా కరిగిపోయాయి. చూస్తుండగానే కంపెనీ షేర్లు దాదాపు 38 శాతం మేర పడిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఈ దెబ్బతో ఆర్థిక కష్టాల నుండి బయటపడటానికి 85 శాతం మంది ఉద్యోగుల్ని సైతం తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ఆర్థికంగా మెరుగుపడకపోవటంతో ఆస్తులను విక్రయించాలని యుఎస్ దివాలా కోర్టులో కంపెనీ ఫైల్ దాఖలు చేసిందని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయమై.. వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డాన్ హార్ట్ మాట్లాడుతూ ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే తమ ముందున్న ఉత్తమమైన మార్గమని చెప్పుకొచ్చారు.