జర్నలిస్టులను అవమానిస్తే సహించేది లేదు. అంబటి జోజి రెడ్డి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు అంబటి జోజి రెడ్డి శుక్రవారం కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడిన జోగు రామన్న ను వెలికి తీసిన అమ్మా చానల్ పై కేసు పెడితే సహించేది లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ తీస్తాం స్వర్ణ తెలంగాణ చేస్తాం అని హామీలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తున్నట్టు అని ఆయన విమర్శించారు. ప్రజలకు వారిది లా ఉండే అమ్మ న్యూస్ పై కేసు పెట్టిన జోగు రామన్న పై టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి అని ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోక పోతే ఊరుకునేదె లేదు లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై పోరాడే మీడియా రంగాలను నిలదీసిన నిందించే హక్కు ఎవరికీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అమ్మా ఛానల్ను అవమానిస్తే సహించేది లేదు అని ఆరోపించారు. ఏ మూలన ప్రజలకు అన్యాయం జరిగిన వెలికి తీసే జర్నలిస్టులను అభినందించాలి అని సంబోధించారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో అవినీతి అక్రమా ఆగడాలకు పాల్పడిన జోగురామన్నను అమ్మా చానల్ వెలికి తీసి నిలదీయడంతో అమ్మ చానల్ పై కేసు పెడితే ఊరుకునేది లేదని దుయ్య బట్టరు. ప్రజలకు అన్యాయం చేస్తూ, నిరంకుశ పాలన చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే విధంగా అమ్మా ఛానల్ వ్యవహరించడం వలన జోగు రామన్న కు ఏం అభ్యంతరం అని ఆరోపించారు. అంత చురుకుగా పనిచేస్తున్న అమ్మా చానల్ ను, జర్నలిస్టులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబోధించారు. ఎల్లవేళలా ప్రజా సమస్యలపై దిక్సూచిలా పనిచేస్తున్న అమ్మా చానల్ కు పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన ఆరోపించారు. జోగు రామన్న పై వెంటనె తగిన చర్యలు తీసుకోకుంటే అమ్మా చానల్ తరఫున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలెక్టరేట్ ఎదుట చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు.