కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం – లారీ బస్సు ఢీ
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారి పైన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా డీ కొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదం లో లారీ ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా డీ కొనడంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. బస్సులోని వారికీ చాల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.బస్సులో గాయపడిన వారిని రక్షించడానికి స్థానిక ప్రజలు ముందుకు వచ్చినప్పటికీ ప్రమాద ధాటికి బస్సు నుజ్జు నుజ్జు అవడంతో బస్సులోకి వెళ్లి వారిని రక్షించడం చాల ఇబ్బందిగా ఉంది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.