ఘనంగా వాసాల రమేష్ జన్మదిన వేడుకలు
ప్రేమ, అభిమానం అనేవి మాటల్లో చెప్పలేనివి అది సందర్భం వచ్చినపుడు మాత్రమే చూపించగలరు. అలాంటి సందర్భమే ఇది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన వాసాల రమేష్ బారసా నాయకులూ, గతంలో కొత్తపల్లి ఎంపిపిగా కూడా పనిచేసారు. ఆయనకు ప్రజలతో ఉన్న మమేకం ఎలాంటిది అంటే గ్రామంలో ఎవరికీ ఎలాంటి అవసరం వచ్చిన, ఎలాంటి సమస్య వచ్చిన వెళ్లి అయన ఇంటి తలుపు తడుతారు. “అదేదో సిమినాలో ప్రభాస్ చెప్పినట్లు ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్న ఈ ఇంటికే ఎందుకు వస్తారో తెలుసా, ఈ ఇల్లు పెద్దని అని కాదు ఈ ఇంట్లో పెద్దాయన ఉన్నారని, ఆ డైలాగ్ కరెక్ట్ గా సరిపోయే వ్యక్తి వాసాల రమేష్. ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉన్న అందరికి అందుబాటులో ఉండి అందరి సమస్యలు తీర్చే వ్యక్తిగా ప్రజల్లో నిలిచిపోయారు. అంటే కాకుండా పద్మశాలి సంఘం అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారు. పద్మశాలిల అభివృద్ధికై ఏర్పాటు చేసిన వివిధ వేదికలపై పాల్గొని పద్మశాలీల అభివృద్ధికై ఎంతగానో కృషిచేశారు.
ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన వాసాల రమేష్ జన్మదినం కావడంతో అయన జన్మదిన వేడుకలను, వాసాల రమేష్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతే కాకుండా వాసాల రమేష్ యువసేన ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేసి పండ్లు కూడా అందజేశారు. నేతన్నల అభివృద్ధికై ఎల్లవేళలా కృషి వాసాల రమేష్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జడుపుకోవాలని సోషల్ మీడియా వేదికగా పద్మశాలి కుల బంధువులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గారిపెల్లి శ్రీనివాస్, గూడూరి శ్రీనివాస్, జిండం సుకుమార్ , రాజశేఖర్, వొడ్నాల రాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.