అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా 2023-24 సంవత్సరానికి కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ గారు నియమితు లైనట్టు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ పంకజ్ శ్రీవాత్సవ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో డాక్టర్ కుల్దీప్ సింగ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ పౌరసరఫరా శాఖామాత్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు శుభాభినందనలు తెలిపారు. అలయన్స్ క్లబ్లో అంచలంచలుగా ఎదుగుతూ గత సంవత్సరం ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా నియమించబడడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అలయన్స్ లీడర్లు ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, జిల్లా గవర్నర్ గాలి పెల్లి నాగేశ్వర్, ఐ ఎం ఏ ప్రెసిడెంట్ శ్రీ రామ్ కిరణ్ గారు తదితరులు తమ హర్షాతిరేకాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.