డ్రైనేజీ క్లీన్ చేసిన తాటికొండ రాజయ్య..అందుకోసమే ఆ పని చేసిన BRS ఎమ్మెల్యే..!
తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో చాలా సార్లు విమర్శలతో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈయనపై ప్రశంసల కంటే విమర్శలు, వివాదాలు, గ్రూప్ పాలిటిక్స్ విషయంలోనే చాలా సార్లు వార్తల్లో నిలిచారు. కాంట్రవర్సీతోనే మంత్రి పదవి పోగొట్టుకున్న ఈ ఎమ్మెల్యే షడన్‌గా ప్రజాసేవకుడిగా మారిపోయాడు. ఈసారి ట్రెండ్ మార్చి..ప్రజాసేవ చేస్తున్నట్లుగా ఫోటో(Photo)లకు, వీడియో(Video)లకు పోజులిచ్చారు. పారిశుధ్య కార్మికుడి చొక్క వేసుకున్న రాజయ్య స్టేషన్‌ఘనపూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందున్న డ్రైనేజీ(Drainage)ని శుభ్రం చేశారు. చీపురు పట్టుకొని పారిశుధ్య కార్మికులతో కలిసి పని చేశారు. నియోజకవర్గ ప్రజలు, క్యాడర్ రాజయ్య తీరుపై ఇప్పటి వరకు అసంతృప్తిగా ఉన్నారు. కొందరైతే ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటం, అధిష్టానం పనితీరు సరిగా లేని వాళ్లకు టికెట్ ఇవ్వమని సంకేతం ఇవ్వడం వల్లే తాటికొండ రాజయ్య ఈవిధంగా మారిపోయారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు.
విమర్శలు పోగొట్టుకోవడానికేనా..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పారిశుధ్య కార్మికుడిగా మారారు. తెల్ల పంచె, తెల్ల షర్ట్ వేసుకొని మంది, మార్బలాన్ని వెంటవేసుకొని దర్జాగా తిరిగే ఎమ్మెల్యే..షడన్‌గా మున్సిపల్ సిబ్బంది షర్ట్ వేసుకొని నియోజకవర్గ కేంద్రంలో మురుగు కాలువను శుభ్రం చేశారు. రాజయ్య ప్రవర్తన మొదట అందర్ని ఆశ్చర్యపరిచినప్పటికి అసలు కారణం తెలిసి అందరూ లైట్‌గా తీసుకుంటున్నారు. స్టేషన్‌ఘనపూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందున్న డ్రైనేజీ కాలువను చీపర్లు పట్టుకొని శుభ్రం చేశారు రాజయ్య.
డ్రైనేజీ క్లీనర్ అవతారం..
కాలువను శుభ్రం చేసిన తర్వాత రాజయ్య ..గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్‌కు జీతం అదనంగా వెయ్యి రూపాయలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు గుర్తుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాజయ్య. ఇదంతా రాజయ్య ప్రజలపై ప్రేమతోనో..లేక పార్టీ అధ్యక్షుడిపై గౌరవంతోనే చేసినట్లుగా స్థానికులు భావించడం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన 42మంది పనితీరు సరిగా లేదని ..వాళ్ల పని తీరు మెరుగుపరచుకోకపోతే టికెట్ ఇవ్వమని చెప్పారు. అందుకే రాజయ్య తన పంథా మార్చుకున్నారని నియోజకవర్గంలోని ఆయన వ్యతిరేకులు చెప్పుకుంటున్నారు.
పార్టీ అధిష్టానం, నియోజకవర్గ ప్రజల్లో పూర్తిగా నెగిటివ్ ఒపినియన్ ఉన్న ఎమ్మెల్యే రాజయ్యను ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే జనం విశ్వసిస్తారా ..మళ్లీ ఓట్లేసి గెలిపిస్తారా అనే సందేహాలు సొంత పార్టీ వర్గాల్లోని కొందరికి ఉంది. మరి చూడాలి రాజయ్య డ్రైనేజీ క్లీన్ చేసినందుకైనా జనంలో ఒపినియన్ మారుతుందా..అధిష్టానం ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం సందేహంగానే ఉంది.