నడిరోడ్డు మీదే ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు..
ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన వ్యాధి సోకింది.. అది ఏం వైరల్ అని మీరు ఆలోచిస్తున్నారా.. అదేనండీ ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం.
ఫలితంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఏం చేస్తున్నామోననే విచక్షణ కూడా కోల్పోయే స్థాయికి వెళ్తున్నారు. సాధారణంగా లవర్స్ తమకు ప్రైవసీ లభించిన వెంటనే ముద్దులు పెట్టుకుంటుంటారు. అలాంటి వీడియోలు కూడా మనం చాలానే చూసి ఉంటాం. అభ్యంతరకరంగా ఉన్నా.. అది సహజం అనుకోవచ్చు. అయితే తమకు పట్టిన ఫేమస్ కావాలనే వైరస్ వల్ల ఓ ఇద్దరు అమ్మాయిలు ఇంకో అడుగు ముందుకేసీ కొత్తగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
అస్సలు ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే.. నడిరోడ్డు మీద వెళ్తున్న బైక్ హ్యాండిల్ విడిచి పెట్ట మరి దానిపై ఎదురెదురుగా కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు. అంతేనా గాఢంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సరదాగా రాసుకొచ్చారు. ఇదీ యోగీ రాష్ట్రంలో జరిగితే బాగుండేది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ అయితే పడిపోతే ఆ ముద్దులతోనే సరిపెట్టుకోవాలి.. ఫేమస్ కావాలంటే మరీ ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదు అంటూ హితబోధ చేశారు.
ఇలా చేసేవాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మరీ.. ఇలాంటి వాళ్ల కోసం కష్టపడి చదివిస్తున్నందుకు వాళ్లని నిందించాలి అంటూ ఇంకో నెటిజన్ మండిపడ్డాడు. ఇలా పలువురు నెటిజన్స్ తమ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 30 వేల లైకులు, 5 లక్షల 74 వేలకు పైగా వీక్షించారు.