ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్‌కు డేట్ ఫిక్స్.. 70 దేశాలలో ఒకేసారి.. అధికారిక ప్రకటన..

ప్రభాస్ (Prabhas) సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత ఆదిపురుష్ (Adipurush) అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకానుంది.
దీంతో ట్రైలర్ విడుదలపై టీమ్ ఓ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, థియేటర్‌లలో ఒకే రోజు ట్రైలర్ విడుదల అవుతోంది. 2023లో ప్రపంచం అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్‌ నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది. ఇప్పటికే విడుదలైన ప్రతి గ్లింప్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. . భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా , ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది.

 

రామాయాణం ఆధారంగా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై అభిమానులు నుండి తీవ్రమైన విమర్శలను అందుకుంది ఆదిపురుష్ టీమ్. దీంతో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్‌ను మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలకావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకానుంది. ఇక మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది. దీని కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి.

ఇటీవల ప్రభాస్ లుక్‌కు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను వదలగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్‌గా సీతగా కృతి సనన్ లుక్‌ను వదిలింది టీమ్. ఈ వీడియోకు కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మోషన్ పోస్టర్ వీడియోలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత మాయ చేసింది అని చెప్పొచ్చు. అది అలా ఉంటే ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. ఈ చిత్రం జూన్ 13న న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శించబడనుంది. దీనికి సంబంధించిన టీమ్ ప్రకటన చేసింది. ఈ ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ని ప్రదర్శించడం ఖచ్చితంగా గొప్ప విషయం అని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు, భూషణ్ కుమార్ నిర్మించారు.

రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్, ప్రాజెక్ట్ కే, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా డీలక్స్ అంటూ ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents