చిన్న చికెన్ ముక్క నిండు ప్రాణాలు తీసింది.. అసలేం జరిగిందంటే.
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనేది పాత సామెత. అయితే తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.
మహబూబాబాద్ జిల్లాలో చికెన్ కూర తింటూ ఓ వృద్ధుడు మరణించిన సంఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన.. ముత్తయ్యకు.. ముక్క కూర అంటే.. ఎంతో ఇష్టం. చికెన్ కూర వండటంతో.. తినేందుకు ఎంతో ఇష్టంతో కూర్చున్నారు. అయితే ముద్ద నోట్లో పెట్టుకోగానే.. ముక్క గొంతులోకి జారిపోయింది. అక్కడే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది లోపలికి వెళ్లలేదు.. బయటకు రాలేదు. గొంతుకు అడ్డం పడటంతో.. ఆయనకు ఊపిరి ఆడలేదు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. ఆ కుటుంబం.
గొంతులో చికెన్ ముక్క ఎలా ఇరుక్కుంది.?
అసలు గొంతులో చినెక్ ముక్క ఎలా ఇరుక్కుందన్న దానిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సాధారణంగా మనం ముక్కు నుంచి పీల్చుకునే గాలి, నోటి నుంచి తీసుకునే ఆహారం కలిసే చోటు ఒకటి ఉంటుంది. మింగిన ఆహారం అన్నవాహికకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పొరపాటున తినే ఆహార పదార్థాలు శ్వాస నాళంలోకి వెళ్తుంటాయి. అలాంటి సమయాల్లోనే సమస్య ఏర్పడుతుంది. ఎపిగ్లాటిస్ అనే కండరం మనం ఆహారం మింగిన సమయంలో శ్వాస నాళాన్ని మూసి వేస్తుంది దీంతో ఆహారం అన్నవాహికలోకి వెళుతుంది. పొరపాటున ఆహారం శ్వాసనాళంలోకి వెళితే శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..