ఢీ ఫైనల్‌ కోసం రూ.3,50,000 ఇచ్చాను, గెలిచిస్తానన్నాడు.. చైతన్య మాస్టర్‌ తల్లి

కొరియోగ్రాఫర్‌చైతన్య ఏప్రిల్‌ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్‌ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు.

కానీ ఫైనల్‌ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్‌ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది’ అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents