నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రులకు మరికొన్ని గంటల్లో ఈ ఫలితాలు చూసుకోవచ్చు. టెన్త్ రిజల్ట్స్ ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా… వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ముగియగా 14వ తేదీన వాల్యూయేషన్ ప్రక్రియ ను ప్రారంభించారు అధికారులు. మొత్తం 18 సెంటర్లలో మొదలైన ఈ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ వరకు కొనసాగింది. ఫలితాల్లో తప్పులు దొర్లకుండా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం. టెక్నికల్ ట్రయల్స్‌ను పలుమార్లు నిర్వహించగా.. ఇది తుది దశకు చేరింది. దీంతో మే 10 లేదా మే 12వ తేదీల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా చెక్ చేసుకోండి..
విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. SSC Results పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)