డాక్టర్ చెరిమెల మాన్విని సంతాప సభ
ఈనెల 18వ తేదీన కార్డియాక్ అరెస్టుతో అకాల మరణం చెందిన అచీవర్ స్కూల్స్ అధినేత చెరిమల వెంకటేశ్వర్రావు గారి కుమార్తె డాక్టర్ చెరిమల మాన్విని సంతాప సభ స్థానిక వాసుదేవ హాస్పిటల్ లో ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137 A ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్స్ లోని పలువురు వక్తలు మాట్లాడుతూ మాన్విని భవిష్యత్తులో ఎంతో ఉన్నత ఆశయాలతో పైకెదిగి సమాజసేవకు తోడ్పాటును అందించాలని భావించేదని ఆమె అకాల మరణం తమను ఎంతో బాధించిందని ఆమె ఆత్మ శాంతికై ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ గాలిపెల్లి నాగేశ్వర్ డాక్టర్ ఇమాదుద్దీన్ అహ్మద్, వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.