మెరుపు వేగంతో ధోని స్టంపింగ్
క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ధోని ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. రెప్పపాటులో ఎన్నో స్టంప్ ఔట్‌లు చేసిన ఘనత ధోని సొంతం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023 ఫైనల్‌లో ధోని మరోసారి తన ప్రతిభను కనబర్చాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ను మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేశాడు, రివ్యూ లో చూడగా 0.1సెకండ్ గా రికార్డు అయింది. గిల్ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.