విద్యార్ధులకు గుడ్ న్యూస్.. మారిన మధ్యాహ్న భోజనం మెనూ
నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. బాలలు కార్మికులుగా మారడాన్ని తగ్గించేందుకు బడిలోనే ఒక పూట భోజనం పెట్టడంతో.. విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం లభించినట్లయింది. అయితే ఈ పథకం పలుమార్లు విమర్శలు వస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ కారణంగా ఈ మెనూలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ బడులు దేవాలయాలుగా మారాయి. తినడానికి తిండి లేక.. ఇల్లు గడవక కష్టంగా మారుతున్న సమయంలో చిన్న పిల్లలను కూడా పనులకు పంపేవారు తల్లిదండ్రులు. వారికి రెండు పూటలా భోజనం పెట్టేందుకు వీరికి కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక చదువుకుంటామంటే స్కూల్ యూనిఫామ్, బుక్స్ వంటి సదుపాయాలతో పాటు భోజనం పెట్టాల్సింది. దీంతో బడులకు పంపడం మానేసి.. తమ వెంట పనులకు తీసుకెళ్లేవారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. బాలలు కార్మికులుగా మారడాన్ని తగ్గించేందుకు బడిలోనే ఒక పూట భోజనం పెట్టడంతో. విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం లభించినట్లయింది. వారికి పౌషిక్టాహారం కింద గుడ్లు భోజనంలో మిళితం అయ్యేలా చేస్తోంది. అయితే ఈ మధ్యాహ్న భోజన పథకంలో పలుమార్లు విమర్శలు వస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ కారణంగా ఈ మెనూలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణలో చదువుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నూతన విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారానికి పెద్ద పీట వేస్తూ.. అలాగే పిల్లలు తినేందుకు ఆసక్తి కలిగించేలా మెనూను సిద్ధమయ్యింది. మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజ్ బిర్యానీ పెట్టాలని గతేడాది వరకు ఉన్న సూచనను మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నతూచ తప్పకుండా పాటించాలన్న కేంద్రం ఆదేశాల మేరకు దానితో పాటు కిచిడీని కూడా మిళితం చేసింది. గతేడాది మధ్యాహ్న భోజన పథకం పనితీరును పరిశీలించిన కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాయింట్ రివ్యూ మిషన్ బృందం.. మెనూ మార్చాలని సూచించింది. ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ కొత్త మెనూ రూపొందించింది. ఈ మెనూను పరిశీలిస్తే.. సోమవారం- కిచిడీ, కోడిగుడ్డు, మంగళవారం- అన్నం, సాంబార్, బుధవారం- అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, శుక్రవాం- అన్నం, సాంబారు, శనివారం- అన్నం, ఆకుకూర పప్పు లేదా వెజ్ బిర్యానీ ఉండవచ్చు.
అలాగే ఈ నూతన విద్యా సంవత్సరం నుండి ఈ మెనూ అమలులోకి రానుండి. వేసవి సెలవుల అనంతరం పున: ప్రారంభమయ్యే తొలి రోజు నుండి ఈ మెనూని అమలు చేయాలని స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం మధ్యాహ్నం భోజన పథకం కింద అన్నం వండి పెట్టినందుకు వస్తువుల ఖర్చు కింద రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5.45, 6-10 తరగతులకు రూ.8.17 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 26 వేల పాఠశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.అయితే ఈ మెనూతో పిల్లలకు భోజనం పెట్టడం సాధ్యం కాదని మధ్యాహ్న భోజన పథక కార్మికులు వాపోతున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా..కేంద్రం వాటికి అయ్యే ఖర్చును పెంచకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ గౌరవ వేతనాన్ని రూ.1 వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతామని గతేడాది సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని, దానిపై నెలల క్రితమే జీఓ పాస్ చేసినప్పటికీ అమలు కావడం లేదని వాపోతున్నారు.