కారును వెనక నుండి డీ కొన్న మరో కారు
జగిత్యాల పట్టణంలోని మంచి నీళ్ల భావి చౌరస్తా సమీపంలో నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పై శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి మరొక కారుని వెనక నుండి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు కాగా రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ ఐ ఎల్ రామ్ సంఘటనా స్థలానికి చేరుకుని కార్లను పక్కకు తొలగించి వేశారు. ఇద్దరు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయగా వారు ఆల్కహాల్ తీసుకొనట్టు నిర్ధారణ అయ్యింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారు సురక్దితంగా బయట పడ్డారు.