ఈనెల 17న తీగల వంతెన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ పట్టణంలోని మనేరు వాగుపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 17న ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం మంత్రి గంగుల ఆహ్వానించారు. తెలంగణ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల లో కలిసి మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి వెంట ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి – హరిశంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు