ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిసింది సుక్మా దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్టు తెలిసింది శనివారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం
గాయపడిన మావోయిస్టులలో దళ నాయకుడు మంగాడు ఉన్నట్లు తెలిసింది,రాష్ట్ర రాజధాని పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్మా గ్రామ సమీపంలోని అడవిలో ఉదయం 5.30 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం రేగ్రగట్ట ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌లో నిర్వహిస్తుండగా.. పోలీసులపైకి మావోయిస్టుల కాల్పులు మొదలు పెట్టారని పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.