బీభత్సం.. నడిరోడ్డులో తల్వార్లతో దాడి (వీడియో)
హైదరాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో ఓ మేకల వ్యాపారి నడిరోడ్డులో బీభత్సం సృష్టించాడు. మేకలు తమ కార్ల పైకి ఎక్కి, వాటిని పాడు చేస్తున్నాయని కొందరు అభ్యంతరం తెలిపారు. మేకలను స్వంత స్థలాల్లో కట్టుకోవాలని సూచించారు. దీంతో మేకల యజమాని రెచ్చిపోయాడు. కార్ల ఓనర్లపై మరికొందరితో కలిసి తల్వార్లు, ఇనుప రాడ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.